బాలీవుడ్ లో రాధికా ఆప్టే ఉన్న హీరోయిన్స్ లో తాను డిఫెరెంట్ గా వుంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేసినా కూడా, తాను ఎన్నో బోల్ట్ షోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టేది. ఈ ఫోటోస్ చాలా హాట్ గా వుండేవి. అలాగే తాను అన్ని విషయాలపై ఓపెన్ గా కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడుతుంది.
రీసెంట్ గా హీరోయిన్స్ మీద కామెంట్స్ తో వైరల్ గా మారింది.బాలీవుడ్ లో హీరోయిన్స్ అందం కోసం చేసుకొనే సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా మంది మంచిగా కనిపించడం కోసం అన్ని బాడీ పార్ట్ లకు సర్జరీ లు చేసుకుంటున్నారని కాని నాకు సర్జరీ ఏ మాత్రం అవసరం లేదని చెప్పుకొచ్చింది.
అలాగే సినిమా పరిశ్రమ లో వేదింపులు జరుగుతుండడం గురించి, ఆడవాళ్ల పై వివక్ష గురించి గొంతెత్తి చెప్పింది. అలాగే ఆమె గతంలో తనను టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరో షూటింగ్ లో నడుము మీద గిల్లి కిత కితలు పెట్టాడని చెప్పి బాంబ్ పేల్చింది. తెలుగులో తనతో చేసింది కొద్ది మంది మాత్రమే కాబట్టి చాలా మంది ఈజీ గా గెస్ చేసారు. ఇక వయస్సు పెరుగుతున్నా కూడా అందాలు చూపించే విషయంలో తగ్గేది లేదని ఆమె ఫొటోస్ చూస్తేనే తెలుస్తుంది.