చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ అభిమానులు నిరసనలు చేపట్టారు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఇక నిన్నటివరకు మాట్లాడని చిత్ర పరిశ్రమ ఒక్కొక్కరిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అశ్వినీదత్, సూపర్ స్టార్ రజినీకాంత్.. తమ మద్దతును తెలిపారు.

Raghavendra Rao: గతంలో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడిన  వెంకటేశ్వరస్వామే మళ్లీ చంద్రబాబును కాపాడతాడు, దర్శకుడు రాఘవేంద్రరావు FB  పోస్ట్ ...

తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం.. చంద్రబాబు ఈ బ్లాక్ మార్క్ ను దాటుకొని బయటకు రావాలని ట్వీట్ చేశాడు. గతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకంఉడా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సినీ రంగం నుంచి స్పందించిన మొదటి వ్యక్తి రాఘవేంద్రరావే.

మరోవైపు.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ లో టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బుధవారం హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద భారీగా ఐటీ ఉద్యోగులు నిరసన చేశారు. ఐ యామ్ విత్ సీబీఎస్ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబుకు మద్దతు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని, నిరసనకు అనుమతి లేదంటూ ఐటీ ఉద్యోగులను చెదరగొట్టారు. టీడీపీ సానుభూతిపరుల ఆందోళనతో విప్రో సర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news