ఛార్మినార్‌ నుంచి గెలిచి చూపిస్తా – రఘునందన్ రావు సవాల్‌

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఛార్మినార్‌ నుంచి గెలిచి చూపిస్తానని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్‌ విసిరారు. సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్, 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను చార్మినార్ లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.

తండ్రి కేసిఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరే చోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. నల్లగొండ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాగోస బిజెపి భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్ రావు మాట్లాడారు. లిక్కర్ స్కాం లో ఇరుక్కుపోయిన కల్వకుంట్ల కవిత నీతులు చెప్పడం దారుణమని రఘునందన్ రావు ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news