తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ . ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా మంది కమెడియన్స్ , యాంకర్ అనసూయ, నాగబాబు, రోజా కూడా షో ను విడచి పెట్టారు. వాస్తవానికి అనసూయ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు.
ఆ షో వల్లే తనకి మిగిలిన షోస్ మరియు సినిమా అవకాశాలు వచ్చాయి. మరి ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని అనసూయ షో వదిలి పెట్టింది. ఈ సందర్భంగా పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్, వల్గర్ కామెంట్లు, వల్ల చాలా భాద పడ్డాను అని చెప్పింది. ప్రస్తతానికైతే పుష్ప 2, మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. తాజాగా అనసూయ సుడిగాలి సుధీర్ మీద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఓ టీవీ యాంకర్ సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉందని అనసూయని ప్రశ్నించారు. దీనికి సాధరణంగా అందరూ కంఫర్ట్ అని లౌక్యంగా చెపుతారు. కాని అనసూయ మాత్రం అనవసరమైన కామెంట్ చేసింది.సుధీర్ నాకు జూనియర్, ఆ విషయం మీకు తెలియదా అంటూ, ఈ ప్రశ్న ఆయన్నే అడగాలి అంటూ తాను తనకంటే సీనియర్ అని అర్దం వచ్చేలా అంది. దీనితో సుధీర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో అనసూయని సోషల్ మీడియాలో ఆమె బిహేవియర్ గురించి , గతంలో వివాదాల పై ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు.