సీఎం జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్

ఏపీ ముఖ్య మంత్రి జగన్ కు  ఎంపీ  రఘురామ కృష్ణరాజు ఊహించని షాక్ ఇచ్చారు.  సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో  రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ వేశారు. మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు.

కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు. అయితే.. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కాగా ఇటీవలే ఎంపీ రఘురామ రాజు రాజేంద్రన్ కేసు కింద అరెస్టైన సంగతి తెలిసిందే.