దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట మార్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలనా కేంద్రం విషయంలో ఆయన మాట తప్పి, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. గతంలో దసరాకు వెళ్తామని చెప్పారని, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారని విమర్శించారు. రిషికొండను తవ్వి రూ.500 కోట్లతో వివిధ భవనాలు కడుతున్నారని మండిపడ్డారు. పర్యాటకం కోసం నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోందని, అందుకే అయితే అంత పెద్ద నిర్మాణాలు ఎందుకో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి విశాఖకు మకాం మార్చినంత మాత్రాన సర్వీసు నిబంధనల ప్రకారం పాలనా అధిపతిగా ఉన్న ఇతర సీఎస్, ఇతర కార్యదర్శులు శాశ్వతంగా వెళ్లే అవకాశం ఉండదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు తప్పకుండా రిలీఫ్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని అధికార వైసీపీ భయపడుతోందన్నారు. ఆ కారణంగానే హఠాత్తుగా మార్గదర్శి కేసును బయటకు తీసుకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు కేసులో ఈ రోజు వాదనలు పూర్తవుతాయని, త్వరలో బయటకు వస్తారన్నారు. ఆయనను ఇన్ని రోజులు జైల్లో ఉంచడం బాధాకరమన్నారు.
అంతే కాదు, అంతే కాదు, రుషి కొండపై పర్యాటక భవనాలను నిర్మిస్తున్నామని కోర్టుకు చెప్పి, నివాస సముదాయం, కార్యాలయాలను నిర్మించడం కచ్చితంగా కోర్టును తప్పుదారి పట్టించడమే. ఇలా నిర్మించిన అక్రమ భవన సముదాయంలో కి మకాం మార్చితే సీఎం జగన్‌కు తిప్పలు తప్పవు’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.