అదేంటోగాని ప్రతిపక్ష టీడీపీ నేతలు జగన్ సర్కార్ వైపు ఆకర్షితులవుతున్నారు… సొంత పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజు మాత్రం మొదటి నుంచి రెబల్ ఎంపీ గా మారిపోయి జగన్ సర్కార్ పైన విమర్శలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణంరాజు పలు విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా మరోమారు రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు.
ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించిన రఘురామకృష్ణంరాజు… ప్రభుత్వం దృష్టికి సమస్యలు ఎవరైనా తీసుకొస్తే పరిష్కరించాలి అంటూ కోరారు. కరోనా పై చర్యలు తీసుకోవాలి అంటు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అన్నింటికీ జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైపోయిందని… అలాగే జగన్ అన్న కరోనా కేర్ లేదా… మరేదైన పేరు పెట్టుకుంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించారు. ఏ పేరు పెట్టినా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఉండాలి అంటూ హితవు పలికారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.