వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. బట్టలు ఊడదీసి నగ్నంగా !

-

వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మరో సారి ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని… తాడి ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కావడం గమనార్హం. జాతీయ స్థాయి మెడికల్ సీట్ల కోటాలో బాధితుడికి కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు లభించింది.

ఈ నేపథ్యంలోనే కాలేజీ కి వచ్చిన ఆ రాజస్థాన్ వ్యక్తిని ముగ్గురు విద్యార్థులు బట్టలు విప్పించి ర్యాగింగ్ చేశారు. ఈ అవమానానికి గురైన ఆ బాధితుడు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో ఘటన గురించి విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డిఎంఈ రమేష్ రెడ్డి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి వచ్చి… ఈ ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో… బాధితుడికి క్షమాపణలు చెప్పించారు అధికారులు. దీంతో ఆ వివాదం ముగిసిందని కాకతీయ మెడికల్ కాలేజ్ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news