జీఎస్టీ అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పలు రకాల ఆహార పదార్థాలు ధాన్యాలపై 5% జిఎస్టి విధిస్తూ జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. డబ్బున్న వారికి అనుకూలంగానే బిజెపి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. జీఎస్టీ ని గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ మరోసారి మండిపడ్డారు. పలు సేవలు, ఉత్పత్తులపై జీఎస్టీని పోలుస్తూ ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేశారు.
” హెల్త్ ఇన్సూరెన్స్( ఆరోగ్య బీమా) పై 18 % జీఎస్టీ, ఆసుపత్రిలో గదులపై 5% జిఎస్టి.. అదే వజ్రాల పై మాత్రం 1.5% జిఎస్టి. ప్రధానమంత్రి ఎవరి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారనే బాధాకరమైన విషయానికి గబ్బర్ సింగ్ టాక్స్ (జిఎస్టి) చిహ్నం. తక్కువ రేటు తో వుండే ఒకే స్లాబ్ జీఎస్టీ తో అత్యవసరమైన, నిత్యావసరాల ధరలు నియంత్రణలోకి వస్తాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. అదే సమయంలో ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా పన్నులు పెంచడం ఆగిపోతుంది.” అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
GST on Health Insurance: 18%
GST on Hospital Room: 5%
GST on Diamonds: 1.5%‘Gabbar Singh Tax’ is a painful reminder of who the PM cares for.
A single, low GST rate will reduce compliance costs, prevent govt from playing favourites & ease burden on poor & middle class families.
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2022