రంగారెడ్డి ‘కారు’లో రగడ..డ్యామేజ్ ఖాయమే!

-

పైకి కేసీఆర్ ఏదో దేశాన్ని మార్చేస్తానని హడావిడి చేస్తున్నారు గాని…తెలంగాణలో మాత్రం ప్రజలు టీఆర్ఎస్‌ని మార్చేసేలా కనిపిస్తున్నారు. అంటే పార్టీలో ఉన్న లోపాలని కవర్ చేసుకుంటూ కేసీఆర్ ఎప్పటికప్పుడు ముందుకెళుతున్నారు…కానీ పార్టీలో లోపాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్తితి. అలాగే ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

అటు టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటుంది…రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఈ రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేతల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. సీటు కోసం నేతలు పోటీ పడటమే కాకుండా…ఒకరినొకరు డ్యామేజ్ చేసుకునే పరిస్తితికి వచ్చారు. ఉమ్మడి రంగారెడ్డిలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి..గత ఎన్నికల్లో 11 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకోగా, 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది.

అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు…దీంతో రంగారెడ్డి మొత్తం టీఆర్ఎస్ చేతుల్లో ఉంది…ఇలా ఉండటమే టీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పి అయింది..నాయకులు ఫుల్‌గా ఉండటంతో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య రగడ నడుస్తోంది. అటు ఎల్బీనగర్‌లో సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత రామ్ మోహన్‌లకు పడటం లేదు. ఇక మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి వర్గాలకు పొసగడం లేదు. ఇటు చేవెళ్ళలో ఎమ్మెల్యే యాదయ్యకు, మాజీ ఎమ్మెల్యే కే‌ఎస్ రత్నంల మధ్య రచ్చ నడుస్తోంది.

అలాగే పరిగి, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరుగుతుంది..ఈ పరిణామాలు పూర్తిగా టీఆర్ఎస్‌కు మైనస్ అవుతున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో రంగారెడ్డిలో కారుకు డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయి..ఒకరికి సీటు ఇస్తే మరొకరు వ్యతిరేకంగా పనిచేసే పరిస్తితి ఉంది. మొత్తానికి చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఈ సారి కారుకు గట్టిగానే డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news