ప్రజలకు చేసిందేమీ లేదు…రాహుల్

-

తెరాస ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమి లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ…ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలని తప్పుదోవ పట్టించారన్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రజలు తమకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, నీళ్లు నిధులు, నియామకాలు అన్నీ తమకే అని కలలు కన్నారు. కానీ, ఈ నాలుగున్నరేళ్ల తెరాస ప్రభుత్వం ప్రజలు ఆశించినట్లుగా ఏమీ చేయలేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లను మార్చి అంచనాలను పెంచేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారు, పార్లమెంట్‌లో పాసైన ప్రతి బిల్లుకూ కేసీఆర్‌ మద్దతు ఉంది. తెరాస అంటే ‘తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌పరివార్‌’ అని ఎద్దేవాచేశారు.

రాహుల్ మాట్లాడుతూ..ప్రజలకు ప్రభుత్వం చేసిందేమి లేదంటూ… పేర్కొనగా..సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రసంగానికి… అవును మరీ … మీరు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఏం చేశారులే..అంటూ వివిధ కామెంట్స్ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news