కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపధ్ పథకం వద్దంటూ దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదిక ద్వారా స్పందించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ పథకం పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ నే ఉంది.
తాజాగా రాహుల్ గాంధీ స్పందిస్తూ..” జై జవాన్, జై కిసాన్ విలువలను బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా ఎనిమిదేళ్లుగా కించపరుస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారని ఇంతకుముందే నేను చెప్పాను. ఇప్పుడు నేను మరో విషయం చెబుతున్నాను. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ మాఫివీర్( క్షమాపణలు చెప్పే వ్యక్తి)గా మారి దేశ యువత డిమాండ్ కు తలొగ్గుతారు.” అగ్నిపధ్ పథకాన్ని ఉపసంహరించుకుంటారని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
8 सालों से लगातार भाजपा सरकार ने ‘जय जवान, जय किसान' के मूल्यों का अपमान किया है।
मैंने पहले भी कहा था कि प्रधानमंत्री जी को काले कृषि कानून वापस लेने पड़ेंगे।
ठीक उसी तरह उन्हें ‘माफ़ीवीर' बनकर देश के युवाओं की बात माननी पड़ेगी और 'अग्निपथ' को वापस लेना ही पड़ेगा।
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2022