కోహ్లి కి అండ‌గ రాహుల్ గాంధీ

-

దుబాయ్ వేదిక గా జ‌రుగుతున్న టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుంది. ఇప్ప‌టి కే దాయాది దేశ‌మైన పాక్ చేతిలో ఓడి పోవ‌డంతో భార‌త అభిమానులు టీమిండియా పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అలాగే రెండో మ్యాచ్ లో కూడా న్యూజి లాండ్ తో ఓడిపోవ‌డం తో విమ‌ర్శల స్థాయి పెరిగింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి పై రోజు రోజు కు విమ‌ర్శ‌లు పెరుగుత‌న్నాయి.

ఈ సంద‌ర్భం లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ కోహ్లి కి మ‌ద్ద‌త్తు గా నిలిచాడు. ట్విట్ట‌ర్ వేదిక గా కోహ్లి కి స‌పొర్ట్ చేస్తు పోస్టు పెట్టాడు. ఈ వ్య‌క్తులంద‌రూ ద్వేషం తో నిండి ఉన్నారు. వారిని క్ష‌మించు. అలాగే జ‌ట్టు ను కూడా కాపాడు అని రాహుల్ గాంధీ అన్నాడు. కాగ గ‌తంలో కూడా టీమిండియా బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు రాహుల్ గాంధీ ష‌మీ కి అనుకూలంగా ట్టీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news