దేశవ్యాప్తంగా బై పోల్స్ లో బీజేపీకి ఎదురుగాలి…

-

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అంసెబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 7 స్థానాలను మాత్రమే గెలిచింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థాానానికి ఎన్నికలు జరగితే బీజేపీ కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపే అధికారంలో ఉంది. మరోవైపు గత బెంగాల్ జనరల్ ఎన్నికల్లో సత్తా చాటి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ…తాజాగా జరిగిన బై ఎన్నికల్లో మాత్రం దారుణంగా విఫలమైంది. అక్కడ నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగితే మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మూడు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా లోక్ సభ స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం సాధించాయి. కర్ణాటకలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి బీజేపీ గెలుచుకోగా.. మరోటి కాంగ్రెస్ గెలుచుకుంది. రాజస్థాన్ లోని రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్, అస్సాంలలో బీజేపీ ఏకపక్షంగా విజయాలు సాధించింది. అస్సాం రాష్ట్రంలో 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షం యూపీపీఎల్ తో కలిసి అన్నిస్థానాలను కైవసం చేసుకుంది. మధ్య ప్రదేశ్ లో 3 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండు చోట్ల బీజేపీ, మరో చోట కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి.

Read more RELATED
Recommended to you

Latest news