కర్ణాటకలో కమీషన్లు తీసుకునే ప్రభుత్వం : రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కన్నడ రాజ్యంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన సర్కార్ అని రాహుల్ విమర్శించారు.

కర్ణాటక బీజేపీ సర్కార్‌ లంచం తీసుకుంటోందని కాంట్రాక్టర్లు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని రాహుల్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 40శాతం కమిషన్‌తో పనిచేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల నుంచీ లంచాలు తీసుకుంటోందని.. రైతులు, కార్మిక వర్గాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రామిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాని అన్నారు. 26వ రోజు భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఆయన కర్ణాటకలోని పాత మైసూరు వీధుల్లో రాహుల్‌ నడిచారు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు 600కి.మీలకు పైగా రాహుల్‌ పాదయాత్ర కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news