సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ.. హిందువుల పేరుతో హింస, ద్వేషాన్ని పెంపోందిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా..సభ మొత్తం దద్దరిల్లింది.
కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభ అనంతరం బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్టాండప్ కమెడియన్ అని కంగనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన సభలో చేసిన కామెడీ కి ఇప్పటికి నవ్వుకుంటున్నామని.. అతను హిందువలపై చేసిన తన ప్రకటనలకు క్షమాపణ చెప్పాలని నేను భావిస్తున్నానని మీడియాతో అన్నారు.