కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పైన పార్లమెంట్‌కు వచ్చారు. అనంతరం పార్లమెంట్ వెలుపల రాహుల్‌గాంధీ మాట్లాడుతూ రైతుల సందేశాన్ని పార్లమెంట్‌కు తీసుకువచ్చాను. రైతుల గొంతును కేంద్ర ప్రభుత్వం అణచివేస్తూ పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వడం లేదు. ఈ నల్ల చట్టాలను వారు రద్దు చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలు ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్త కోసమని దేశ ప్రజలంరికీ తెలుసు అని అన్నారు.
మరోవైపు ‘పెగాసెస్’నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, నినాదాలతో హోరెత్తించడంతో
మధ్యాహ్నం 12గంటల వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్(సవరణ) బిల్లు 2020, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంట్రిప్రెన్యూయర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లు, 2021 చర్చకు రానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దివాలా, దివాలాకోడ్ (సవరణ) బిల్లు 2021ను ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో నేవిగేషన్ బిల్లు, 2021, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) సవరణ బిల్లు, 2021 చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.