కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసినా రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేశారు. తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని రిలీజ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాము అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని స్టపష్టం చేశారు. తెలంగాణ లో ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయ స్థాయిలో మాట నిలబెట్టుకుంటాం’ అని తుక్కుగూడ సభలో హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news