ఏపీ వాసులకు అలర్ట్ …. ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు….!

-

ఏపీలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అదేవిధంగా కృష్ణ, గుంటూరు, అనంతపురం ,కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో చలి ప్రభావం కూడా పెరిగింది. దాంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news