బ్రేకింగ్ : తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో NIA వరుస సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు ఇండ్లలో NIA అధికారులు వరుస సోదాలు కొనసాగిస్తున్నారు. మొదటగా హైదరాబాదు లోని మాజీ మావోయిస్టు రవిశర్మ అనురాధ లో ఇంటిలో సోదాలు నిర్వహించిన NIA అధికారులు.. ప్రకాశం లో కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కళ్యాణ్ రావు గతంలో కొనసాగారు. ఇక విశాఖ పట్నంలో అనురాధ ఇంట్లో NIA అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు NIA అధికారులు. ఇటీవల కాలంలో ఆర్కె జీవిత చరిత్ర పై పుస్తకం ప్రచురణపై ఆరా తీస్తున్న NIA అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ నాగోల్ లో రవి శర్మ, అనురాధ , సుభాష్ నగర్ లో భవాని , ఒంగోలులో కళ్యాణ్ రావు , వైజాగ్ అన్నపూర్ణ ఇళ్ళపై NIA అధి కారుల దాడులు జరుగుతున్నాయి. ఈ సోదాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.