రెయిన్ అలెర్ట్ : నేడు, రేపు భారీ వర్షాలు !

-

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం తుఫానుగా మారినట్లు చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారడంతో దానికి ‘గతి’ అనే పేరు పెట్టారు. ఇది సోమాలియా తీరం వైపు వెళుతోంది. ఇక బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తుఫానుగా మారి తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య ఈనెల 25న తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.

దీని ప్రభావంతో తెలంగాణలో రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తేమ కారణంగా ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు రేపు ఆంద్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news