ఏపీ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ శుక్రవారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది వాతావరణ శాఖ.
ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్ భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల విద్యత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా.. వర్షపు నీరు రోడ్డు పైకి వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని తొలగించారు.