రాగల రెండు రోజుల్లో 25 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

-

తిరుగోమనానికి నైరుతి రుతుపవనాలు దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో రుతుపవనాలు చాల వేగంగా ఉండడంతో భారత దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు భారీగా పడుతున్నాయి. పశ్చిమ మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు విజృంభించాయి. అంతే కాక ఢిల్లీ, ముంబయి, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, తమిళనాడు, కేరళ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి వర్షాలు భారీగా మారాయి. ఇక పోతే, భారత వాతావరణ కేంద్రం రాగల రెండు రోజుల్లో 25 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

Maharashtra: Rain to be back from today!

పలు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. అయితే పలు రాష్ట్రాలకు ఎల్లో, మరికొన్ని రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్‌ను కూడా జారీ చేయాల్సి వచ్చింది. వాతావరణ శాఖ పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని తెలియచేసింది. దీని ప్రభావంతో శనివారం పలురాష్ట్రాల్లో భారీ వర్షాపాతం నమోదైనట్లు తెలియపరిచింది. రాబోయే రెండురోజుల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. తూర్పు రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణశాఖ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news