పంజాబ్ సిఎంకు రైనా థాంక్స్…!

-

పంజాబ్ లోని పఠాన్‌ కోట్‌ లో తన కుటుంబంపై దాడి చేసిన నేరస్థులను పట్టుకున్నందుకు గానూ… పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పోలీసులకు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. నేరస్థుల అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయడంతో హత్య కేసులో అందరు నిందితులను పట్టుకున్నామని ఆ రాష్ట్ర సిఎం ప్రకటన చేసారు.

వ్యక్తిగత కారణాల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ రైనా ఐపిఎల్ 2020 నుంచి తప్పుకుని గత నెలలో దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. “ఈ ఉదయం పంజాబ్లో, ముగ్గురు నేరస్థులను పట్టుకున్న దర్యాప్తు అధికారులను నేను కలిశాను. వారి ప్రయత్నాలన్నింటినీ నేను నిజంగా అభినందిస్తున్నాను. మా నష్టాన్ని తిరిగి పొందలేము కాని ఇది మరిన్ని నేరాలు జరగకుండా తప్పకుండా చేస్తుందని రైనా పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news