ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో మూడు రోజులపాటు వర్ష సూచనను తెలిపింది భారత వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ & పొరుగు ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం రాయ్పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ మరియు ఆగ్నేయ దిశగా,తూర్పు మధ్యకు బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పడమర గాలులు వీస్తున్నాయి.
అయితే రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచన ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లోఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు, చాలాచోట్ల కురిసే అవకాశముంది.ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా చోట్ల సంభవించే అవకాశముంది .
రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా చోట్ల సంభవించే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా చోట్ల సంభవించే అవకాశముంది .
రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.