టాలీవుడ్ దివంగత స్టార్ హీరో శోభన్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న హీరో ఈయనే అని చెప్పొచ్చు. మహిళలు ఆయన సినిమా వచ్చిందంటే చాలు..వెంటనే చూసేసేవారు. సెంటిమెంట్, నటనను సమపాళ్లలో మిక్స్ చేసి ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శోభన్ బాబు.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన శోభన్ బాబు..సినిమాల మీదున్న ఇష్టంతో సినీ అవకాశాల కోసం తన కుటుంబంతో చెన్నైకి వచ్చాడు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టుూ సైకిళ్ల మీద తిరిగాడు. చిన్న వేషం దొరికినా చాలు..అనుకుని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ పక్కన ‘దైవబలం’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే, ఆ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయనకు తర్వాత ఊహించిన స్థాయిలో వేషాలు లభించలేదు.
చెన్నైలో భార్య, పిల్లలను పోషించడం కోసం డబ్బులు లేక శోభన్ బాబు ఇబ్బంది పడుతున్న రోజులవి. వేషాలు కావాలని అడిగితే దొరకడం లేదు. ఇక డబ్బు కావాలని ఎవరిని అడిగే మనస్తత్వం లేని శోభన్ బాబు ఒకానొక టైమ్ లో ఇక చాలు..ఇంటికి వెళ్దామని తన భార్యతో చెప్పాడట. అప్పుడు మీరు ఓపికగా ఉండండి..అవకాశాలు వస్తాయని శోభన్ బాబుకు ఆయన భార్య సలహా ఇచ్చింది.
తప్పుకుండా మంచి నటుడు అవుతారనే నమ్మకం తనకు ఉందని శోభన్ బాబు భార్య చెప్పింది. అలా కుటుంబ పోషణకు వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కాలం వెళ్లదీస్తూ అవకాశాల కోసం వెతకసాగాడు. అలా చిన్న చిన్న వేషాలు వేస్తున్న క్రమంలోనే ‘రోజులు మారాయి’ అనే చిత్రం ద్వారా శోభన్ బాబు కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత శోభన్ బాబు సంపాదన పెరిగింది. తెలుగు చిత్ర సీమలోనే గొప్ప హీరో అయిపోయి చక్కటి విజయాలు అందుకున్నారు. ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు.