యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై రాజ్ భవన్, ప్రభుత్వ వర్గాల మధ్య వివాదం ముదురుతోంది. సబితా ఇంద్రారెడ్డి రాజ్ పవన్ కు వచ్చి బిల్లుపై చర్చించాలని లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లెఖా అందలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని చెప్పారు. అయితే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. సెప్టెంబర్ 7వ తేదీన మెసెంజర్ ద్వారా మంత్రికి సమాచారం ఇచ్చామని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజ్ భవన్, ప్రభుత్వ వర్గాల మధ్య మరోసారి వివాదం ముదిరినట్టయింది. దీనిపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.