తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అబౌవ్ ఆవరేజ్ గా నిలిచాయి. ఇక ఎక్కువగా హెబ్బా పటేల్, అవికా గోర్ వంటి హీరోయిన్లతో కలిసి నటించిన ఈయన మంచువిష్ణు తో మల్టీస్టారర్ మూవీలను కూడా తెరకెక్కించడం జరిగింది. ఇక పోతే ఒకానొక సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు మధునందన్ కు ఫోన్ చేసి చనిపోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పాడట. అయితే ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధునందన్ మీడియా ముందు వెల్లడించారు.ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న మధునందన్ ఇటీవల సినిమాలలో అడపాదడపా చేసుకుంటూ తన కెరీర్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన గతంలో నటన మీద ఆసక్తితో గూగుల్ లో జాబ్ చేసి ఆ తర్వాత వదిలేసినట్లు కూడా వెల్లడించారు. ఇక తాజాగా రాజ్ తరుణ్ గురించి మధునందన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అసలు విషయం ఏమిటంటే కరోనా సమయంలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులంతా గోవా వెళ్లారు. కానీ లాక్ డౌన్ విధించడంతో అక్కడనుంచి రావడానికి దారులు ఏర్పడలేదు. కేవలం కొద్ది రోజులు లాక్ డౌన్ ఉంటుంది అని అనుకుంటే.. ఏకంగా రెండు నెలల పాటు లాక్డౌన్ విధించారు. ఇక దీంతో ఒంటరిగా ఉన్న రాజ్ తరుణ్ ఎక్కువకాలం ఒంటరిగా జీవించలేక తనకు ఫోన్ చేసి ఇంకో వారం ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ మధునందన్ కు ఫోన్ చేసి చెప్పారట.ఇక మాదాపూర్ కి తన ఫ్రెండ్ కారు వెళుతుంది..అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు నిత్యావసర సరుకులు అందించే వాళ్ళు.. ఇక అలాగే నా ఫ్రెండ్ కి రాజ్ తరుణ్ ఉండే గండిపేటలో ఇంటి అడ్రస్ ఇచ్చి ఎలాగోలా ఇంటికి తీసుకు రమ్మని చెప్పాను. రాజ్ తరుణ్ చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాము ఇక మా అపార్ట్మెంట్లో సుమారుగా 20 మంది పిల్లలు ఉండేవారు వారి తో ఆడుకుంటూ సమయాన్ని కాలక్షేపంగా ముగించారు. అలా సుమారు మూడు వారాలపాటు మధునందన్ ఇంట్లోనే ఉండిపోయారట రాజ్ తరుణ్. ఇక లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత గోవా నుంచి రాజ్ తరుణ్ ఫ్యామిలీ తిరిగి రావడంతో ఇక ఇంటికీ వెళ్ళిపోయాడు అని మధు నందన్ తెలిపారు.
రాజ్ తరుణ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు : మధునందన్.. కారణం.?
By Divya B
-
Previous article