పెళ్లి పీటలపై నాని, నజ్రియా..‘తందానానంద’ సాంగ్ రిలీజ్

-

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవనుంది. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ మరో సాంగ్ వీడియో రిలీజ్ చేశారు.

నవ్వులు పూయించేందుకు రెడీగా ఉన్న ఈ చిత్రంలో ని ‘తందానానంద’ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నదియా, రేవతి, సీనియర్ హీరో నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాని చాలా చక్కటి కామెడీ రోల్ ప్లే చేశారు.

‘తందానానంద’ సాంగ్ వీడియో లో నాని, నజ్రియాల పెళ్లిని చాలా ఫన్నీ వేలో చూపించారు. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాపైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news