ఈగలను ఫ్రిజ్‌లో పెట్టి రాజమౌళి ఏం చేశాడో తెలుసా?

-

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల RRRతో రికార్డు సృష్టించారు. ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. తాజాగా టీవీల్లో పిక్చర్ టెలికాస్ట్ కాగా టీఆర్పీ అదిరిపోయింది. ఇకపోతే ఆయన స్టార్ హీరోలు లేకుండా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. అలా ఆయన స్టార్ హీరో లేకుండా తీసిన సినిమా ‘ఈగ’. కాగా, ఈ సినిమా కోసం రాజమౌళి చాలా వింత పనులు చేశారు. అవేంటో తెలుసుకుందాం.

తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేంత వరకు దర్శకుడు రాజమౌళి ప్రతీ సన్నివేశాన్ని చెక్కుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన్ను ‘జక్కన్న’ అని పిలుస్తుంటారు. రాజమౌళి తను తీసే ప్రతీ సినిమాకు తప్పక రీసెర్చ్ చేస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో ఫిల్మ్ తీసి జనాలను ఎంటర్ టైన్ చేస్తుంటారు.

‘ఈగ’ సినిమాతో రాజమౌళి వండర్ క్రియేట్ చేశారు. కాగా, ఈ సినిమా తీసే ముందర రాజమౌళి వింత పనులు చేశారు. కొన్ని ఈగలను తీసుకొచ్చి తన ఫ్రిజ్ లో పెట్టుకున్నారు. అలా ఫ్రిజ్ మొత్తం ఈగలను ఉంచుకుని వాటిని పరిశీలించారు. ఈగల సుప్తావస్థ తెలుసుకోవడం కోసం రాజమౌళి అలా ఈగలను పరిశీలించారు.

గడ్డకట్టే ఉష్ణోగ్రతలో ఈగలు ఎలా ఉంటాయి? అనే సంగతి తెలుసుకోవడం కోసమే రాజమౌళి అలా చేశారట. అలా ఈగల గురించి లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే రాజమౌళి సినిమా తీశారు. ఇక ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

సుదీప్ విలన్ గా నటించగా, నేచురల్ స్టార్ నాని, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు అవార్డులూ వచ్చాయి. రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తు్న్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news