ప‌వ‌న్‌తో సినిమా తీయ‌న‌ని తేల్చేసిన జ‌క్క‌న్న‌.. ఎందుకో తెలుసా..?

-

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్‌` సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు మొద‌టి సారి క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ప్ర‌క్ష‌కులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్‌.. లాక్‌డౌన్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. దీంతో అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.

 

అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లో ఉంటున్న రాజ‌మౌళి ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంటర్య్వూలు ఇస్తూ ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెడుతున్నారు. ఇప్ప‌టికే త‌న నెక్ట్స్ ప్రోజెక్ట్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఉంటుంద‌ని చెప్పి.. ఫ్యాన్స్‌ను ఖ‌షీ చేశాడు. అయితే రాజమౌళి, పవన్ కల్యాణ్ కాంబిలో సినిమా వస్తే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ, వీరినిక నిరాశే మిగిల్చాడు రాజ‌మౌళి. ప‌వ‌న్‌తో తాను సినిమా తీయ‌న‌ని తేల్చి చెప్పేశాడీయ‌న‌.

అందుకు కార‌ణం.. `’పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. ఆయన సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎక్కువు రోజుల పాటు సినిమాలు తీస్తారు. అందుకే ప‌వ‌న్‌కు నాకు సెట్ కాదు. ఈ క్ర‌మంలోనే పవన్‌తో సినిమా తీసే అవకాశమే లేదు` అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విష‌యం ప‌వ‌న్ ప్రేక్ష‌కుల్లో నిరాశ నింపినా.. జ‌క్క‌న్న చెప్పిన దాంట్లోనూ వాస్త‌వం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news