మహేశ్ ఫాన్స్ కి ఎగిరి డాన్స్ చేసే న్యూస్ చెప్పిన రాజమౌళి ! 

-

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విషయంలో దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని ఇంటర్నేషనల్ ఫిలిం స్థాయిలో పెంచటంతో ఆర్.ఆర్.ఆర్ ఈ సినిమాపై చాలా మంది ఆసక్తి పెంచుకున్నారు.

Image result for rajamouli mahesh babu"

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ ఇప్పించాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. సినిమాకి హైప్‌ని పెంచడానికి రాజమౌళి ఈ ఎక్స్పరిమెంట్ చేస్తున్నట్లు హిందీ వెర్షన్‌కు సంబంధించిన అమితాబ్ బచ్చన్ చేత వాయిస్ ఓవర్ చేయించాలనే రాజమౌళి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

 

నిజంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయంలో మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తే కచ్చితంగా ఇది సూపర్ స్టార్ అభిమానులకు ఎగిరి డ్యాన్స్ వేసే న్యూస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

Read more RELATED
Recommended to you

Latest news