ప్రభుదేవా కొరియోగ్రఫీలో రాజశేఖర్..‘అల్లరి ప్రియుడు’ డ్యాన్స్ స్టెప్స్ ఎలా కంపోజ్ చేశారంటే?

-

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా..డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి డ్యాన్సర్ గానే కాక హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా నిరూపించుకున్న ప్రభుదేవా..తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ డ్యాన్సర్ అని చెప్పొచ్చు. ఆయన కొరియోగ్రఫీలో యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అలా జరిగింది కూడా..ఆ సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ మ్యాన్ గా ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆయనను లవర్ బాయ్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయడం విశేషం. రాఘవేంద్రరావు-రాజశేఖర్ కాంబోలో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ పిక్చర్ ఎంతటి సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇందులో సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్.

ఈ సాంగ్స్ లో రాజశేఖర్ డ్యాన్స్ స్టెప్స్ చాలా చక్కగా ఉంటాయి. ప్రభుదేవా ఈ సాంగ్స్ కోసం తొలుత ఆయన డ్యాన్స్ స్టెప్ లు వేసి చూపించే వారు. అలా ఆయన చేసిన స్టెప్పులు యాజ్ ఇట్ ఈజ్ గా చేయడం తన వల్ల కాలేదని రాజశేఖర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అయితే, తను డ్యాన్స్ స్టె్ప్స్ సరిగా చేయకపోయినా ప్రభుదేవా అసహనం వ్యక్తం చేయలేదని తెలిపారు డాక్టర్ రాజశేఖర్. తన బాడీకి సరిపోయేలా స్టెప్స్ కంపోజ్ చేశారని, తనను ‘డాక్టర్ మైఖేల్ జాక్సన్’ అని సరదాగా పిలిచేవారని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news