ఓటిటిలో సినిమాల విడుదలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త రూల్

-

ఈ డిజిటల్ యుగంలో ఓటీటిల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్ తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల గ్యాప్ లోనే ఓటీటీ లోకి రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని సినిమాలు డైరెక్టుగా ఓటీటీ లోనే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతల కౌన్సిల్ లెటర్ తో పాటు, ఓటీటి, పిపిఎఫ్ చార్జీలు, టికెట్ల ధరలు, ప్రొడక్షన్ క్యాస్ట్ పై చర్చించారు.

ఓటిటిలో సినిమాల విడుదల కు తెలుగు ఫిలిం చాంబర్ ఓ కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది. రూ.6 కోట్ల బడ్జెట్ లోపల నిర్మించిన సినిమాల విడుదలకు నాలుగు వారాల గ్యాప్ ఉండాలని నిబంధన విధించింది. అలాగే భారీ బడ్జెట్ సినిమాలో ఓటీపీ రిలీజ్ కు 10 వారాల గ్యాప్ ఉండాలని నిబంధన విధించింది. ఈ నిబంధనలు ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే తెలంగాణలో రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతిపాదించిన సినిమా టికెట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. చిన్న సినిమాలు..(A, B) – 100, 125, (C కేంద్రాలు) – 70, 125.మీడియం సినిమాలు..(A, B) – 112, 177, (C కేంద్రాలు) – 100, 177.పెద్ద సినిమాలు..(A, B) – 177, 295, (C కేంద్రాలు) – 150, 295 గా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news