గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే.. రంజాన్ తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్. జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. డీజేపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన హెచ్చరించారు. ‘ఈ బక్రీద్ సందర్భంగా సంబరాలు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేకలు, గొర్రెలు కొసుకుని బక్రీద్ సంబరాలు చేసుకుంటే కూడా మాకు ఇబ్బంది లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆవులు, దూడలను కోయరాదు.
ఆవులు, దూడలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదు. కనీసం ఎక్కడా చెక్ పోస్ట్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. మీకు చేతకాకపోతే చెప్పండి మా ఆవులు దూడలు రక్షించుకునేందుకు మేమే రంగంలోకి దిగుతాం. సీఎం కేసీఆర్‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాను.. వెంటనే చర్యలు తీసుకోండి. మతపరమైన గొడవలు కావద్దనే మేం ఇలా అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే మా టీమ్‌లు రంగంలోకి దిగుతాయి.. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా గోషామహల్ ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ లేఖపై డీజీపీ, కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.