సోనియాకు గహ్లోత్ ఫోన్.. ‘పార్టీ హైకమాండ్​ను ఛాలెంజ్ చేయను’ అన్న సీఎం

-

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం వేళ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఫోన్ చేశారు. తాను హైకమాండ్ ను ఎప్పుడు ఛాలెంజ్ చేయనని ఆమెతో అన్నట్లు సమాచారం. గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో ఆయన నిలుస్తారా? లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్‌ వీడలేదు.

పార్టీని ధిక్కరించేలా వ్యవహరించిన గహ్లోత్‌ను అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పించాలంటూ సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే, ఇందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకొనే ముందు సోనియా గాంధీ కాంగ్రెస్‌ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణమైన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్రం పరిశీలకులు అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్‌ మాకెన్, మల్లికార్జున ఖర్గే… రాజస్థాన్ పరిణామాలపై సోనియాకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా  ముగ్గురు నేతలకు అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news