హైద‌రాబాద్ నుంచి మ్యాచ్‌ను లాక్కున్న రాజ‌స్థాన్‌.. ఘ‌న విజ‌యం..!

-

దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 26వ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఓ ద‌శ‌లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని రాయ‌ల్స్ భావించింది. అయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ప‌రాగ్‌, తెవాతియాలు హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. ప‌రుగుల‌ను వేగంగా రాబ‌ట్టారు. దీంతో రాజ‌స్థాన్ జ‌ట్టు హైద‌రాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

rajasthan won by 5 wickets against hyderabad in ipl 2020 26th match

మ్యాచ్‌లో హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జ‌ట్టు‌ బ్యాట్స్‌మెన్లలో మనీష్‌ పాండే, కెప్టెన్‌ వార్నర్‌లు రాణించారు. 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన పాండే జట్టును ఆదుకున్నాడు. అలాగే డేవిడ్‌ వార్నర్‌ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. చివర్లో కేన్‌ విలియమ్సన్‌ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేయగా, గార్గ్‌ 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, జయదేవ్‌ ఉనడ్కట్‌లు తలా ఒక వికెట్ తీశారు. మరొక వికెట్‌ రన్‌ అవుట్‌ రూపంలో లభించింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ 19.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 163 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ప‌రాగ్‌, తెవాతియాలు విజృంభించారు. మ్యాచ్ హైద‌రాబాద్ వైపు మ‌ళ్లిన ద‌శ‌లో వారు జాగ్ర‌త్త‌గా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. అనంత‌రం మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. దీంతో రాజ‌స్థాన్ విజ‌యం సునాయాస‌మైంది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో తెవాతియా 45 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, ప‌రాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 42 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్‌, ర‌షీద్ ఖాన్‌ల‌కు చెరొక 2 వికెట్లు ల‌భించాయి. మ‌రో వికెట్ ర‌న్ అవుట్ రూపంలో ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Latest news