బ్రేకింగ్ : రజనీ అన్నాత్తే సెట్ లో ఏడుగురికి కరోనా..

-

హైదరాబాద్ లోని రజనీకాంత్ అన్నాత్తే సినిమా షూటింగ్ నిలిపివేశారు. షూటింగ్ బృందంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేశారు. హైదరాబాద్ లో రజనీ కాంత్ హోమ్ క్వారెంటైన్ అయ్యారు. అయితే రజనీకి కరోనా నెగటివ్ అని తేలడం ఊరట కలిగించే అంశం. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు.

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా లతో పాటు నయనతార, కీర్తి సురేశ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాని అన్నయ్య పేరుతో తెలుగులోను డబ్బింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాని 2021 సంక్రాంతి టార్గెట్ గా మేకింగ్ ప్లాన్ చేసినప్పటికి లాక్ డౌన్ తో సమ్మర్ కి వెళ్ళింది. ఇక ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సమ్మర్ కు కూడా ఈ సినిమా డౌటే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news