సంక్రాంతి బరిలో ‘లాల్‌ సలాం’.. కీలక పాత్రలో రజనీకాంత్‌

-

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ముంబయి డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీలకపాత్రలో న‌టిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం క‌పిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

Lal Salaam - Release Announcement | Rajinikanth | Aishwarya Rajinikanth |  Lyca Productions - YouTube

లాల్ స‌లామ్ చిత్రంతో పాటు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి బ‌రిలో చాలా సినిమాలు ఉన్నాయి. యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజా సజ్జా కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘హ‌నుమాన్‌’, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో వస్తున్న ‘గుంటూరు కారం’, మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న’ఈగ‌ల్‌’. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ‘VD13’తో పాటు నాగార్జున హీరోగా న‌టిస్తున్న ‘నా సామిరంగ’ సంక్రాంతి బ‌రిలో ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news