2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ అని విమర్శించారు. ప్రభుత్వానికి పరోక్షంగా కంట్రోల్ లేకపోతే .. సంతోష్ అనే కంట్రోలర్ ను ఎలా నియమించారని ప్రశ్నించారు.
టీఎస్పిఎస్సి పర్మినెంట్ ఉద్యోగులు, అవుట్ సోర్స్ ఉద్యోగులను డిసైడ్ చేసిది ప్రభుత్వమేనని తెలిపారు. హైదరాబాద్ లో అనేక లైబ్రరీలో కూర్చుని సంవత్సరాలుగా చదువుకున్న నిరుద్యోగుల బతుకులు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పిఎస్సి అనేది ఆర్టికల్ 317 ద్వారా ఏర్పడ్డ రాజ్యాంగ సంస్థ అయినా ప్రభుత్వం ద్వారా పరోక్షంగా నడుపబడుతోందని అందరికీ తెలుసని సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, ఇతర ఉద్యోగులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఉద్యోగం నుంచి తొలగిపోవాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉంటె, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి ఎదురుదెబ్బ..తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ ను పెద్ద ఎత్తున నేతలు వీడుతున్నారు. కొంతమంది టికెట్ రాలేదని పార్టీ నుండి బయటకు వస్తుంటే..మరికొంతమంది పార్టీ నేతల ఫై ఆగ్రహంతో బయటకు వస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి జగదీశ్ రెడ్డి కీలక అనుచరుడు..బీసీ నేత వట్టె జానయ్య కుటుంబం ..బిఆర్ఎస్ ను వీడి బీఎస్పీ పార్టీ లో చేరారు.