మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు

-

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్ కు సుప్రీం కోర్ట్ బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పెరరివాలన్ కు యావజ్జీవ కారాగా శిక్ష పడి 32 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. పిటిషనర్ ప్రవర్తన, అతని అనారోగ్యం, అతను 30 ఏళ్లకు పైగా జైలులో గడిపిన వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అతన్ని బెయిల్‌పై విడుదల చేయాలని మేము అభిప్రాయపడుతున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఇదిలా ఉంటే కేంద్ర మాత్రం పెరరివాలన్ బెయిల్ ను వ్యతిరేఖిస్తోంది.

నిందితుడు 30 ఏళ్లుగా జైలులో ఉన్నారని, పెరోల్ సమయంలో అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 47 ఏళ్ల పెరరివాలన్ తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ… సుప్రీంలో పిటిషన్ వేశాడు. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో ఎన్నికల ర్యాలీలో ఎల్టీటీఈకి చెందిన ధను అనే మహిళ ఆత్మాహుతి బాంబర్ గా మారి రాజీవ్ గాంధీని హత్య చేసింది. ధనుతో పాటు మరో 14 మంది కూడా చనిపోయారు. 1999 మేలో పెరారివాలన్, మురుగన్, శాంతమ్, నళిని అనే నలుగురు దోషులకు సుప్రీం కోర్ట్ మరణ శిక్ష విధించింది. 2014 ఫిబ్రవరి 18న సంతన్, మురుగన్, పెరరివాలన్ మరణ శిక్షలను సుప్రీం కోర్ట్ జీవిత ఖైదుగా మార్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news