ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం పై లోక్ సభ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. నిన్న జరిగిన విమాన ప్రమాద ఘటనలో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు అని రాజ్నాథ్ సింగ్ లోక్సభలో వెల్లడించారు. హెలికాప్టర్ కూలి పోవడాన్ని స్థానికులు గమనించారు అని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభం అయిందని రాజ్ నాథ్ సింగ్ చేశారు.
వెల్లింగ్టన్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. సూళ్లూరు ఎయిర్ బేస్ నుంచి 11.48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయిందని..12.15 గంటలకు బిల్డింగ్ వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందన్నారు. మ.12:08 గంటలకు సూళ్లూరు ఏటీపీ నుంచి కాంటాక్ట్ తెగిపోయిందని… తర్వాత ఈ ప్రమాదంపై తమకు వివరాలు తెలిశాయి అని పేర్కొన్నారు. కాగా.. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో… ఏకంగా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. రేపు వారి అంత్యక్రియలు జరుగనున్నాయి.