దేశ తొలి సీడీసీ బిపిన్ రావత్ మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. భారత దేశ భద్రత కోసం మిలటరీని మరింత పటిష్టం చేస్తున్న క్రమంలో బిపిన్ రావత్ మరణించడం సైన్యంతో పాటు భారత దేశానికి భారీ దెబ్బగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. నేడు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి పార్థీవ దేహాలు ఢిల్లీకి తరలించనున్నారు.
తాజాగా హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై సుప్రీం కోర్ట్ రిటైర్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరణించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మరియు 11 మంది ఇతరులు మరణించడం ఈ సంఘటన “షాకింగ్” అని మరియు దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నాడు. ఫైనల్ రిపోర్టు రాలేదు కాబట్టి ఏదైనా చెప్పడం చాలా కష్టంగా ఉంది, కానీ వాస్తవం ఏమిటంటే తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో ఉన్న మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ పేల్చివేయబడినట్లు కనిపిస్తోంది’’ అని స్వామి అన్నారు..