కమలం కౌంటర్లు…కేసీఆర్ గురివింద కబుర్లు..!

-

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి..ఎమ్మెల్యేలతో బేరాలు ఆడిన వీడియోలని ప్రదర్శించారు. అలాగే ఇప్పటికే బేరం ఆడిన ముగ్గురు వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో బడా నేతల పాత్ర ఉందని..బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, తెలంగాణతో పాటు ఏపీ, రాజస్తాన్, ఢిల్లీ ప్రభుత్వాలని కూల్చడానికి చేస్తున్నారని, దీని ఆపాలని చెప్పి చెప్పుకొచ్చారు.

ఇక మోదీ, అమిత్ షా, జే‌పి నడ్డా టార్గెట్‌గా కేసీఆర్ ప్రెస్ మీట్ సాగింది. అయితే జాతీయ స్థాయిలో రాజకీయం చేయబోతున్న నేపథ్యంలో కేసీఆర్..ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. పైగా బీజీపీ సైతం గట్టిగా కౌంటర్లు ఇస్తుంది..గంటల పాటు కేసీఆర్ మీడియాతో సోది చెప్పారని, పైగా కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీయించి.. అదే నిజమని నమ్మించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ విడుదల చేసిన వీడియోలోని వ్యక్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని కిషన్ రెడ్డి లాంటి వారు ఖండిస్తున్నారు.

బీజేపీ నేతలు చెప్పే విషయంలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలు అని చెప్పి..కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి తీసుకొచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలని ముందు పెట్టుకుని కేసీఆర్ నీతులు చెప్పడాన్ని ఎవరు నమ్మడం లేదు. 2014 నుంచి కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్‌లోకి లాగారో అందరికీ తెలుసు. పైగా కొనుగోలు కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి..కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారే.

అంటే తమ కిందే తప్పులు పెట్టుకుని..మళ్ళీ ఎదుటపార్టీ మీద అలాంటి ఆరోపణలే చేస్తే..ప్రజలు నమ్మడం కష్టం. పైగా జాతీయ రాజకీయాల్లో మోదీ హవా తగ్గించి..తన ఇమేజ్ పెంచుకోవడానికి కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధమైపోతుంది. కాబట్టి ప్రజస్వామ్యం ఖూనీ అయిపోతుందని ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్..అదే ప్రజాస్వామ్యం ఎన్ని సార్లు ఖూనీ చేశారో చెప్పాలని కమలం నుంచి కౌంటర్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news