టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సిని ప్రేమికులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ” ఆర్ఆర్ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకశాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు భారీ హైప్ ను పెంచేశాయి.
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ గ్లింప్స్ విడుదల తేదీని ఖరారు చేసింది ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం. 45 సెకండ్ల పాటు ఉండే.. సెకండ్ గ్లింప్స్ ను వచ్చే అంటే నవంబర్ 1 వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్ మరియు రాం చరణ్ కలిసి ఉన్న ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే.. ఈ 45 సెకండ్ల పాటు ఉండే గ్లింప్స్ లో ఇద్దరూ హీరోలు కనిపిస్తారా? లేదా చూడాలి.
Releasing a 45 second glimpse of #RRRMovie on Nov 1st at 11 AM.
🔥🌊#RRRGlimpse 🤟🏻⚡️@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies @PenMovies @jayantilalgada pic.twitter.com/RS99Alr51e— RRR Movie (@RRRMovie) October 30, 2021