‘ఆచార్య’ లో పాత్రపై చరణ్ క్లారిటీ.. మురిసిపోతున్న అభిమానులు..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై మెగా అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకం గా ఉండే అతిథి పాత్ర విషయమై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ అతిథి పాత్రలో ముందుగా మహేష్ బాబు నటించబోతున్నారు అనే టాక్ టాలీవుడ్ టౌన్ లో షికారు చేసింది. ఇక ఆ తర్వాత మహేష్ కాదు రామ్ చరణ్ రంగంలోకి దిగబోతున్నారు అంటూ టాక్ వినిపించింది.

కానీ ఎట్టకేలకు ఆచార్య సినిమాలో అతిథి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ అతిథి పాత్ర చేసేది ఎవరో కాదు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఆచార్యు లో 30 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర చేస్తున్నాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాతో నన్ను నాన్నని ఒకే తెరపై చూడాలనుకున్న తన తల్లి కూడా నెరవేర బోతుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.