బిగ్ బాస్5: కంటెస్టెంట్లను పలకరించనున్న రామ్ చరణ్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోకి మెగా పవర్ స్టార్ అతిధిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో రామ్ చరణ్ మాటామంతీ కలపనున్నాడు. ఐదవ సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున సాదర స్వాగతాలతో రామ్ చరణ్ ని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధమైందని, మరికొద్ది రోజుల్లో రామ్ చరణ్ ఎపిసోడ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ కి రామ్ చరణ్ అతిధిగా వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి అతిధిగా వస్తే, టెలివిజన్ కార్యక్రమానికి రెండవ సారి వచ్చినట్టు అవుతుంది. స్టార్ గ్రూపుకి చెందిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఐదవ సీజన్ కంటెస్టెంట్లని పలకరించనున్నట్లు నమ్మకం కలుగుతుందని విశ్వసిస్తున్నారు.