Bsf సైనికులతో కలిసి లంచ్ చేసిన రామ్ చరణ్

-

అమృత్ సర్ లోని ఖాసా ప్రాంతంలో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15 సినిమా షూటింగ్ జరుగుతుంది.ఆ ప్రాంతంలో తెలుగు హీరో రామ్ చరణ్ ను చూసి బి ఎస్ ఎఫ్ సైనికులు సంతోషించారు.ఈ సందర్భంగా షూటింగ్ ముగింపు రోజున ఆయన అక్కడి సైనికులు లంచ్ కు ఆహ్వానించగా ఆయన తన ఇంటి నుంచి తెచ్చుకున్న వ్యక్తిగత వంట గాడిని అక్కడికి పంపి ప్రత్యేకంగా వెజిటేరియన్ వండించా రు.రామ్ చరణ్ చెఫ్ చేసిన వంటకం సైనికులకు బాగా నచ్చింది.భోజనం సందర్భంగా సైనికులు డ్రిల్ తరహాలో వందన కార్యక్రమం నిర్వహించి లంచ్ చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్, సైనికుల డిసిప్లేన్, వ్యక్తిత్వాలను మెచ్చుకున్నారు.ఈరోజే ఉపాసన కూడా స్వర్ణ దేవాలయంలో సేవ చేసినట్లు ఫోటోలు పెట్టింది.ఇప్పుడు రామ్ చరణ్ సైనికులతో లంచ్ ఫోటోలు పెట్టాడు.శంకర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో ఒక పాత్ర సైనికుడిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.ఇంకా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news