‘అవతార్‌-2’ పై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ‘అవతార్‌-ది వే ఆఫ్‌ వాటర్‌’ దిగ్విజయంగా థియేటర్లో దూసుకెళ్తోంది. ఇక కలెక్షన్ల విషయంలో ఇంతకుముందు రికార్డ్లన్నీ తిరిగ రాస్తోంది. తాజాగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సినిమాలోని ప్రతి సన్నివేశం మనసుని కట్టిపడేసేలా ఉందని అన్నాడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే.. కామెరూన్‌ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాడని చెప్పాడు.

‘‘అవతార్‌-2’లో అందమైన నీటి ప్రపంచాన్ని చూపించారు. అత్యద్భుతమైన విజువల్స్‌, ఆకట్టుకునే ప్రదర్శన.. ఊపిరి బిగబెట్టేలా యాక్షన్‌ సీన్లతో ఈ సినిమా సాగింది. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్‌ కామెరూన్‌ క్రియేట్‌ చేశాడు. ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. ‘అవతార్‌-2’ చూసిన తర్వాత స్వర్గం అంటే ‘పండోరా’ వలే ఉంటుందని ఎవరైనా మాటిస్తే.. మనుషులందరూ చచ్చిపోతారు’’ అని వర్మ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news