రోజా పక్కన దిష్టి బొమ్మ.. బాలయ్యపై వర్మ సంచలన వ్యాఖ్యలు..

-

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. నోటి దురుసుతనంతో వార్తల్లో నిలిచే ఈయ‌న మ‌రో సారి తన నోటికి పనిచెప్పాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. నిన్న మండలిలో 3 రాజధానుల అంశంపై రభస జరుగుతున్న వేళ, లాబీల్లో కూర్చుని ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓ సెల్ఫీ దిగగా, అదిప్పుడు తెగ వైరల్ అవుతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

“వావ్… రోజాగారు ఓ హీరోలా కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారుగానీ, నాకు తెలియదు. చూసేందుకు యాక్… అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. నాకు తెలిసి రోజాకు అతడు దిష్టి బొమ్మ కావచ్చు” అని అన్నారు. ఆపై “అందంగా ఉన్న రోజా పక్కన ఈ చిత్రంలో ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పగరా?” అని ప్రశ్నించారు. దీంతో వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news